
ఫ్లోరోసిస్‌పై అప్రమత్తంగా ఉండండి
పెదకూరపాడు: ఫ్లోరోసిస్‌పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఫ్లోరోసిస్ నియంత్రణ అధికారి డాక్టర్ గిరిధర్ అన్నారు. పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ, నివారణ పై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరిధర్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్ ఏ విధంగా వ్యాపిస్తుందో, దానిని ఏవిధంగా నివారించగలరో వివరించారు. బోర్‌వెల్ తాగు నీటిద్వారా, పొగాకు సంబంధింత వస్తువుల ద్వారా, పానీపూరి, కుర్ కురే వంటి వాటిని తినడం వల్ల అందులో కలిపే బ్లాక్ సాల్ట్ వల్ల, బ్లాక్ టీ వంటివి మితిమీరి ఉపయోగిస్తే ప్రజలు త్వరగా ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడతారని వివరించారు. పాఠశాలలో చదువుతున్న, 3,4,5వ తరగతి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వెలుగొండా రెడ్డి, ఎంపీహెచ్‌ఈఓ లక్ష్మీ మనోహర్, ఎంపీహెచ్‌ఎస్ దిలీప్ కుమార్, బి.శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఫ్లోరోసిస్ నియంత్రణ అధికారి
డాక్టర్ గిరిధర్