
సహకారం.. మంగళం!
యడ్లపాడు: సహకార సంఘాల ఎన్నికల విషయంలో కూటమి ప్రభుత్వం మరోమారు యూ టర్న్ తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే సత్వరమే సహకార ఎన్నికలు నిర్వహిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రైతుల మద్దతుతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వెనువెంటనే సొసైటీలకు త్రిసభ్య కమిటీలుగా కొనసాగుతున్న వారిని వైదొలగాలని బలవంతపు రాజీనామాలు చేయించింది. సహకార సంఘాల్లో పనిచేసే అధికారులను అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జులుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 జూన్‌లో అధికార బాధ్యతలు చేపట్టి వసంత కాలం గడిచినా సహకార సంఘాల ఊసే ఎత్తలేదు. గతనెల 28తో అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జులు పరిమిత కాలం పూర్తి కావడంతో, మరో నెలరోజులు వారే కొనసాగేలా గడువు పెంచి మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు త్రీమెన్ లేదా ఫైవ్‌మెన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తోంది.
సహకార ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే ..?
ఎన్నికల నిర్వహిస్తామన్న హామీ నెరవేర్చని కూటమి వైఎస్ జగన్ హయాంలో మారిన సొసైటీల రూపురేఖలు