
జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు అభినందన
వినుకొండ: జిల్లాస్థాయి పోటీలకుఆరు విభాగాల్లో ఆరుగురు ఎంపికై నట్లు పీఈటీ రాధాకృష్ణ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈవో జఫ్రుల్లా పాల్గొని మాట్లాడుతూ, తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో120 మంది విద్యార్థినీ విద్యార్థులు ఎంపికయ్యారని అందులో ఆరు విభాగాలల్లో ఎంపికై న విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఆయన అభినందించారు. వ్యాసరచనలో సుధారాణి ఉప్పలపాడు, వక్తృత్వం యజ్ఞశ్రీ బొగ్గరం, పాటల పోటీలుౖ వె.హేమలత వేల్పూరు, డాయ్రింగ్ ఎస్.కె.మస్తాన్ వినుకొండ కథలు సి.హెచ్.లక్ష్మయ్య ఇనిమెళ్ల, నాటికల్లో వేల్పూరు విద్యార్థులు ఎంపికవ్వగా వారిని ఎంఈవో అభినందించారు. రాష్ట్ర స్థాయిలో బహుమతులు గెలవాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొత్త బైపాస్ వద్ద గుర్తు తెలియని మృతదేహం
యడ్లపాడు: మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో, నూతన బైపాస్ రోడ్డు పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందడం స్థానికులు గమనించారు. ఆదివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యడ్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతిచెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని, అతని శరీరంపై ఉన్న మాసిన దుస్తులు, అలాగే శారీరక పరిస్థితిని బట్టి గత కొన్ని రోజులుగా సరైన ఆహారం, నీరు లేకపోవడం వల్లే మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అతను స్థానికంగా యాచ కత్వం చేస్తూ జీవనం సాగించే వ్యక్తిగా గుర్తించి నట్లు తెలిపారు. మృతుడికి సోమవారం పంచనామా నిర్వహించిన అనంతరం చిలకలూరిపేట మున్సిపాలిటీ అధికారులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై అనుమానస్పదంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు అభినందన