
ఏపీవో రామారావు సేవలు అభినందనీయం
జిల్లా డ్వామా పీడీ సిద్దా లింగమూర్తి
శావల్యాపురంః మహాత్మాగాంఽధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో 21 సంవత్సరాల పాటు మెరుగైన సేవలు పారదర్శకంగా అందించి అందరి మన్ననలు పొందటం అభినందనీయమని జిల్లా డ్వామా పీడీ సిద్దా లింగమూర్తి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి పధకం విభాగంలో ఏపీవో కటారపు రామారావు విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా పీడీ సిద్దా రామలింగమూర్తి మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారన్నారు. ఉపాధి పథకంలో తన వృత్తినే దైవంగా భావించి తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం పలువురికి ఆదర్శమన్నారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఏపీవో కటారపు రామారావు దంపతులను పూల మాలలు దుశ్శావాలు మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, ఏపీవోలు కె.నాగేశ్వరరావు, ఆంజనేయరాజు, పుష్పారాజ్, లక్ష్మణరావు, మండల క్షేత్ర సహాయకుల సంఘం అధ్యక్షులు అన్నవరపు వెంకటేశ్వరరావు, చెరుకూరి బాలకృష్ణ, ఉపాధి అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.