కౌన్సిలర్‌ ద్విచక్రవాహనం దహనం చేసిన దుండగులు | Sakshi
Sakshi News home page

కౌన్సిలర్‌ ద్విచక్రవాహనం దహనం చేసిన దుండగులు

Published Tue, May 21 2024 9:20 AM

కౌన్సిలర్‌ ద్విచక్రవాహనం దహనం చేసిన దుండగులు

మాచర్ల: మాచర్ల పదో వార్డు కౌన్సిలర్‌ మహంకాళి పిచ్చయ్య ఇంటి ముందు ఉన్న ద్విచక్రవాహనాన్ని సోమవారం ఉదయం గుర్తు తెలి యని దుండగులు దహనం చేశారు. ఇది గమనించిన ఓ వృద్ధురాలు కేకలు వేసింది. మహంకాళి పిచ్చయ్య వెంటనే బయటకు వచ్చి నీళ్లు చల్లి మంటలు అదుపు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పశువుల ఆసుపత్రి వెనుక ఉన్న కౌన్సిలర్‌ ఇంటి ముందు ఉంచిన వాహనాన్ని దహనం చేయడం చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్‌ పిచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరు చేశారనే దానిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. పట్టణంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం భయాందోళనలకు గురిచేస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement