పోలీసు అధికారుల నియామకం | Sakshi
Sakshi News home page

పోలీసు అధికారుల నియామకం

Published Tue, May 21 2024 9:20 AM

పోలీసు అధికారుల నియామకం

నరసరావుపేట: ఎన్నికల సందర్బంగా జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు బాధ్యులను చేస్తూ సస్పెండ్‌ చేసిన అధికారుల స్థానంలో నూతన అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పల్నాడు దిశ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.సుధాకరరావును నరసరావుపేట డీఎస్పీగాను, ఏసీబీకి అటాచ్‌చేసిన కాకినాడ ఎస్సీ, ఎస్టీ సెల్‌ అధికారి సీహెచ్‌.శ్రీనివాసరావును గురజాల డీఎస్పీగా నియమించారు. పల్నాడు ఎస్‌బీ సీఐలుగా బండారు సురేష్‌బాబు, యు.శోభన్‌బాబు, కారంపూడి ఎస్‌ఐగా కె.అమీర్‌, నాగార్జునసాగర్‌ ఎస్‌ఐగా ఎం.పట్టాభిని నియమించారు. వీరిలో కొందరు అధికారులు నూతన జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

నరసరావుపేట డీఎస్పీగా బాధ్యతల స్వీకారం

నరసరావుపేటటౌన్‌: నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకరరావు సోమవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన వీఎస్‌ఎన్‌ వర్మ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసా సంఘటనలకు బాధ్యులను చేస్తూ ఎన్నికల కమిషన్‌ సస్పెండ్‌ చేసింది. ఆయన స్థానంలో పల్నాడు జిల్లా దిశ డీఎస్పీగా పనిచేస్తున్న సుధాకరరావును నియమించింది. ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement