ఉప ఎన్నికలో బణిత కందులియ విజయం
జయపురం: జయపురం సబ్ డివిజన్ కుంధ్రా సమితి అధ్యక్ష పదవికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి బణిత కందులియ తన ఏకై క ప్రత్యర్థి బీజేడీ సమర్ధించిన చంద్రిక కందలియపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించింది. గత సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి పోరజపై సభ్యులు అవిశ్వాస తీర్మానం తీసుకు రావడంతో అక్టోబర్ 3వ తేదీన పదవికి రాజీనామా చేసిక విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి శనివారం ఉప ఎన్నిక జరిగింది. కుంధ్రా సమితిలోని 16 గ్రామ పంచాయతీల సమితి సభ్యుల్లో 15 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సమితి సభ్యులు వేసిన 15 ఓట్లలో ఒక ఓటు చెల్లలేదు. మిగతా 14 ఓట్లలో చంద్రిక కందాలియకు 6 ఓట్లు.. బణితా కందాలియకు 8 ఓట్లు వచ్చాయి. దీంతో బణిత కందాలియ గెలిపొందినట్లు ఉన్నికల అధికారి పట్నాయిక్ ప్రకటించారు. దీంతో ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.


