కొలనారలో చొయితీ ర్యాలీ
రాయగడ: చొయితీ ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని కొలనార సమితి స్థాయి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. బీడీవో రీనా ప్రధాన్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈనెల 26వ తేదీన జిల్లాస్థాయి చొయితీ ఉత్సవాలు స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాలలో జరగనున్నాయి. ఐదు రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
విద్యార్థులకు చిత్రకళ పోటీలు
జయపురం: జాతీయ ఆదివాసీ మహోత్సవం కొరాపుట్ పర్వ్ – 2025 పురస్కరించుకొని జిల్లాస్థాయి చత్రకళ పోటీలను శనివారం నిర్వహించారు. జయపురం విక్రమ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాల సింహాద్రి మహరాణ భవనంలో నిర్వహించిన పోటీల్లో 70 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 5వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులను జూనియర్స్‌గా, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సబ్ సీనియర్స్‌గా, +2 , +3 విద్యార్థులను సీనియర్స్‌గా విభజించారు. ప్రతీ గ్రూపు నుంచి ఉత్తమ చిత్రకారులను గుర్తించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో స్థానిక విక్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాప్ట్ కళాశాల ప్రిన్సిపాల్ జుధిస్టర్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం
రాయగడ: స్థానిక పాత పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సరోజిని క్లీనిక్‌లో శనివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో జిల్లా కేంద్రాస్పత్రి వైద్యుడు డాక్టర్ అందవరపు గౌరీ శంకరావు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం, ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చేతుల శుభ్రంతో సంపూర్ణ ఆరోగ్యం
పర్లాకిమిడి: చేతులను శుభ్రం చేసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వక్తలు అన్నారు. స్థానిక సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో జాతీయ హ్యాండ్ వాషింగ్ అవగాహన వారోత్సవాన్ని ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి శనివారం ప్రారంభించారు. సెంచూరియన్ వర్సిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఫ్యాకల్టీ సౌమ్యశ్రీ ప్రదాన్, శుభాశ్రీ పాణిగ్రాహిలు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో తెలియజేశారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నర్సింగ్ విద్యార్థి ఆదిత్యప్రసాద్ సాహు అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
కొలనారలో చొయితీ ర్యాలీ
కొలనారలో చొయితీ ర్యాలీ
కొలనారలో చొయితీ ర్యాలీ


