సందడిగా డ్యాన్స్ పోటీలు
పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరం ఆవరణలో నృత్య అకాడమీ మిరాకిల్ డ్యాన్సు స్టూడియో ఆధ్వర్యంలో 7వ సీజన్ మిరాకిల్ నైట్ కార్యక్రమం ఆది వారం రాత్రి జరిగింది. మిరాకిల్ డ్యాన్స్ సంస్థ డైరెక్టర్ సుభేంద్ర మోహాన్ సేనాపతి కార్యక్రమం నిర్వహించగా, యాంకర్‌గా రంగస్థల నటులు ఆదర్శ దాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శె ఠి, గౌరవ అతిథులుగా డీసీవో అర్చనా మంగరాజ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సల్మన్ రైకా, డీసీపీ యూ అరుణ్‌కుమార్ త్రిపాఠి, సంగీత నాటక అకాడమి సభ్యులు రఘునాథ పాత్రో పాల్గొన్నారు. డ్యా న్స్ పోటీలలో జూనియర్, సీనియర్ కళాకారులు సోలో, గ్రూప్ డ్యాన్సులలో పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతగా సినీనటులు రాకేష్ దేవ్, సినీ నిర్మా త, సమర్పకులు పార్ధసారథీ వ్యవహారించారు.


