73 వినతుల స్వీకరణ
రాయగడ: స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సొమవా రం జిల్లా యంత్రాంగం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన 73 వినతులను కలెక్టర్ విన్నారు. ఇందులో 40 వ్యక్తిగత సమస్యలు, 23 గ్రామ సమస్యలు గుర్తించారు. వాటిని సకాలంలో పరిష్కారమవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇద్దరికి వైద్య ఖర్చుల నిమిత్తం రెడ్ క్రాస్ నిధుల నుంచి రూ.20 వేల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. మరో 8 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.20 వేలను ఆర్థిక సహా యాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్‌ను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జె న్నా, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి అక్షయకుమార్ ఖెముండొ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆసీమా రావ్, జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ బి.సరోజినిదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.


