మహిళలను వేధించరాదు
మల్కన్‌గిరి: వివాహమైన మహిళలను వరకట్నం పేరుతో వేధించడం తగదని జిల్లా మహిళా శిశు సంరక్షణ సమితి కన్వీనర్ మణిమోహన్ సర్కార్ అన్నా రు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ సమా వేశ మందిరంలో వరకట్న నివారణ చట్టంపై సోమ వారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ మహిళ తమ దాంప త్య జీవితం సుఖవంతంగా కొనసాగాలని ఆశపడుతుంటారన్నారు. అయితే కొన్ని కుటుంబాల్లో వరకట్న వేధింపులు తాళలేక ఆఘాయిత్యాలకు పాల్ప డం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశా రు. వరకట్న నిషేధ చట్టం గురించి అవగాహన కలిగేలా అధికారులు కృషి చేస్తే కొంతవరకు సత్ఫలితా లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, ఎస్‌హెచ్‌జీ బృందాలకు చెందిన మహిళలు, పోలీస్ విభాగాధికారులు పాల్గొన్నారు. అలాగే డీఎస్పీ మమత పాణిగ్రహి, చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారి అశోక్ కుమార్ పట్నాయక్‌లు తమ ప్రసంగంలో మహిళల భద్రత గురించి మాట్లాడారు.


