రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్‌ఎస్ ఖాళీలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ కేడర్‌లలో కేటాయించిన మంజూరు చేసిన (కేడరు) పలు పదవుల్లో ఖాళీలు కొనసాగుతున్నాయి. ఆ ఖాళీ పదవుల భర్తీ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశంలో బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే ప్రతాప్ కేశరి దేవ్ ప్రశ్నించారు. దానికి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి లిఖితపూర్వక సమాధానం ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారుల పోస్టులు అఖిల భారత సర్వీసులలో భాగం కావడంతో భారత ప్రభుత్వం వాటిని భర్తీ చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒడిశా కేడర్‌లలో ప్రస్తుతం మంజూరు చేసిన సంఖ్య, ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి.


