సీఆర్‌పీఎఫ్ జవాన్ల స్వచ్ఛ ప్రతిజ్ఞ
కొరాపుట్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్‌పై సీఆర్‌పీఎఫ్ 12వ బెటాలియన్ జవానులు ప్రతిజ్ఞ చేశారు. సోమవా రం జానకీనగర్‌లోని ఆర్‌ఆర్ గ్రౌండులో జవాన్ల సమావేశం నిర్వహించారు. సెకెండ్ ఇన్ కమాండ్ కేకే సింగ్ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2014 నుంచి ఈ ఉద్యమం ప్రారంభించారన్నారు. ఈ ఉద్యమం ముందుకు సాగించడానికి ప్రజలు నడుం బిగించాలని పిలుపు నిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం 15 రోజులు కొనసాగుతోందని కేకే సింగ్ వెల్లడించారు.


