విద్య, ఉపాధిలో రిజర్వేషన్లపై.. ప్రత్యేక చర్చకు అభ్యర్థన | - | Sakshi
Sakshi News home page

విద్య, ఉపాధిలో రిజర్వేషన్లపై.. ప్రత్యేక చర్చకు అభ్యర్థన

Dec 2 2025 7:50 AM | Updated on Dec 2 2025 7:50 AM

విద్య

విద్య, ఉపాధిలో రిజర్వేషన్లపై.. ప్రత్యేక చర్చకు అభ్యర్థన

విద్య, ఉపాధిలో రిజర్వేషన్లపై.. ప్రత్యేక చర్చకు అభ్యర్థన రైల్వే స్టేషన్‌లో మజ్జి గౌరమ్మ చిత్రపటం ఏర్పాటుకు వినతి కాశీనగర్‌లో 7 మిల్లీ మీటర్ల వర్షం వైభవంగా గీతా పారాయణం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం

భువనేశ్వర్‌: విద్య, ఉపాధి కల్పనలో ఇతర వెనుకబడిన వర్గాలు (ఓబీసీ), షెడ్యూల్డ్‌ కులా లు, షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వేషన్ల అంశంపై ప్రత్యేక చర్చ కోసం స్పీకర్‌కు కాంగ్రెస్‌ నాయకుడు లిఖిత పూర్వకంగా అభ్యర్థించారు. కాంగ్రెస్‌ శాసన సభ నాయకుడు రామచంద్ర కద మ్‌ ఈ విషయాన్ని సభ విరామ సమయంలో తెలియజేశారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు 40 శాతం, ఓబీసీలకు 27 శాతం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ వర్గాల కు వారి హక్కులు లభించడం లేదు. ఈ అంశా న్ని ఏకగ్రీవంగా చర్చించాలని రామచంద్ర కద మ్‌ డిమాండ్‌ చేశారు. వాస్తవంగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. కేవలం 11 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇస్తున్నారు. ఇది సిగ్గుచేటు చర్య అన్నారు. మరోవైపు, షె డ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు 40 శాతం ఉండగా.. వారు ఉన్నత విద్యలో 20 శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందుతున్నారు. ఇందులో గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, దళితుల కు 8 శాతం రిజర్వేషన్లు పరిమితం చేశారు. ప్రభుత్వం ఈ నియమాన్ని ఏ ప్రాతిపదికన చేసిందని రామచంద్ర కదమ్‌ ప్రశ్నించారు.

రాయగడ: కొత్తగా నిర్మించిన స్థానిక రైల్వే స్టేషన్‌లో రాయగడ ప్రజల ఆరాధ్య దైవం మజ్జిగౌ రి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ కంభం పాటి హరిబాబును కోరా రు. స్థానిక విశ్వబ్రాహ్మణ వ్యవస్థాపక సభ్యు లు, సమాజ సేవకులు పొట్నూరి భాస్కరరావు సోమవారం గవర్నర్‌ను కలిసి ఈ మేరకు విన తి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారుల కు, డీఆర్‌ఎంకు సందేశాలు పంపించారు.

పర్లాకిమిడి: నైరుతి వాయవ్య బంగళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గజ పతి జిల్లా అంతటా సోమవారం వేకువ జామునుంచి వర్షం పడింది. కాశీనగర్‌లో అత్యధికంగా 7.0 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, పర్లాకిమిడిలో 3.6, జిల్లా వ్యాప్తంగా23.8 మి.మీటర్ల వర్షం కురిసిందని జిల్లా వాతావరణ, ఎమర్జెన్సీ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ వర్షంతో వరి కోతలకు అటంకం ఏర్పడింది.

భువనేశ్వర్‌: పవిత్ర గీతా జయంతి పురస్కరించుకుని స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి సోమవారం సామూహిక గీతా పారాయణం కార్యక్రమం నిర్వహించింది. సమితి సభ్యులు ఆనందోత్సాహాలతో పాలుపంచుకుని సమగ్ర భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేశా రు. సమితి కార్యదర్శి రాయప్రోలు సత్యసా యి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజల్లో ధార్మిక భావాల ప్రేరణకు సమితి తరచూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని అధ్యక్షుడు గన్నవరపు ఆనంద రావు తెలిపారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాదాపుగా అన్నీ టీడీపీ కార్యకర్తలు, వారి ఏజెన్సీలకే ఇవ్వడం వల్ల వారంతా దళారులుగా మారి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అటువంటి ఏజెన్సీలను మార్చాలని ఆమదాలవలస వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాల్లో రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర రావడం లేదన్నారు. పొందూరు మండలంలోని రాపాక, కృష్ణాపురం వంటి ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నిలుపుదల చేయాలని కోరారు. బూర్జ మండలం లక్కపురంలో ఆశా కార్యకర్త పోస్టు అక్రమ భర్తీని అడ్డుకోవాలన్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దసవలాపురం సచివాలయంలో పాత స్థలంలోనే కొనసాగించాలని కోరారు.

మహిళలకు ఉపాధి శిక్షణ

ఎచ్చెర్ల : మండల కేంద్రం ఎచ్చెర్లలోని ఎన్‌టీఆర్‌ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి (ఎపీఎస్‌ఎస్‌డీసీ–గుంటూరు) సౌజన్యంతో 18 నుంచి 45 ఏళ్ల మహిళలకు పలు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ జిల్లా మేనేజర్‌ రబీకాసామ్యూల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్‌ బ్యూటీ థెరపిస్ట్‌(60 రోజులు), హ్యండ్‌ ఎంబ్రాయిడర్‌(45 రోజులు) కోర్సులకు 8వ తరగతి, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సు(90 రోజులు)కు పదో తరగతి చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళలు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, వివరాలకు 8309548067 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

విద్య, ఉపాధిలో రిజర్వేషన్లపై.. ప్రత్యేక చర్చకు అభ్యర్థన1
1/1

విద్య, ఉపాధిలో రిజర్వేషన్లపై.. ప్రత్యేక చర్చకు అభ్యర్థన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement