ఘనంగా సురభి, శిశు మహోత్సవం
పర్లాకిమిడి: రాష్ట్రంలో టెన్త్ పరీక్ష ఫలితాల్లో గజపతి జిల్లా ప్రథమ స్థానం సాధించడం పట్ల ఉపాఽధ్యాయులను జిల్లా ముఖ్య విద్యాధికారి, ఎంపీ (బరంపురం) ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి అభినందించారు. మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో శిశుమహోత్సవం 2025, సురభి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, జిల్లా కలెక్టర్ మధుమిత, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, డీఈఓ మయాధర్ సాహు, అదనపు డీఈఓ గిరిధర్ తదితరులు హాజరయ్యారు. పది పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి, గిరిజన విద్యార్థులకు మేలుచేశారని.. అలాగే రాష్ట్ర రాజధానిలో మా పేరును నిలబెట్టారని మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమంగో అన్నారు. అనంతరం జిల్లాలోని ఏడు సమితిల నుంచి విచ్చేసిన విద్యార్థులకు 11 ఈవెంట్లలో పోటీలను నిర్వహించారు. క్విజ్, వక్తృత్వం, డ్రాయింగ్, సృజనాత్మక రైటింగ్, పాటలు, సాంస్కృతిక, పి.ఎం. పోషణ, మోడల్ పార్లమెంట్ పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. సా విజేతలకు ఏడీఎం ఫల్గుణి మఝి, పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాలు జిల్లా సైన్సు కోఆర్డినేటరు అంపోలు రవికుమార్, బాయ్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మోనాలిసా దాస్, ఇతర సిబ్బంది సహకరించారు.
ఘనంగా సురభి, శిశు మహోత్సవం


