రాగి పంటతో లాభాలు మెండు
రాయగడ: రాగి పంటతో అనేక లాభాలు ఉన్నాయని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి అన్నారు. స్థానిక బిజుపట్నాయక్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి రాగుల దినోత్సవం–25 కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు జిల్లాలో ఆదివాసీలు తమ ప్రధాన ఆహారంగా భావించి వారికి సరిపడ్డ రాగులను పండించుకునేవారని అన్నారు. రాగుల్లో పౌష్టిక గుణాలను గుర్తించిన ప్రభుత్వం ఈ పంటపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి రైతులకు ప్రోత్సహించిందన్నారు. దీంతో ప్రతిఒక్కరూ రాగి పంటపై ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. మన నిత్య ఆహారంలో రాగులు కూడా స్థానాన్ని సంపాదించుకొవడమే అందుకు ప్రధాన కారణమని అన్నారు. జిల్లా అదనపు మేజిస్ట్రేట్ నవీన్ చంద్ర నాయక్ గౌరవ అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో 177 సమితుల్లోని 2,884 గ్రామపంచాయతీల పరిధిలో 14,841 గ్రామాల్లో ఈ పంట సాగు చేస్తున్న రైతుల సంఖ్య 2,43,256 మందికి చేరడం విశేషమన్నారు. అనంతరం రాగులకు సంబంధించిన ప్రచార రథాన్ని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ప్రారంభించారు. అంతకు ముందు రాగి పంటల్లో ఉత్తమ రైతులకు ఈ సందర్భంగా వేదికపై సన్మానించారు.
రాగి పంటతో లాభాలు మెండు


