150 కిలోల గంజాయి స్వాధీనం
● ఒకరి అరెస్టు
పర్లాకిమిడి: అబ్కారీ శాఖ కమిషనర్ డంబుఽరధ ఖండ, డిప్యూటీ కమిషనర్ శృతికాంత రవుత్ ఆదేశాల మేరకు బరంపురం అబ్కారీశాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. గంజాం జిల్లా బరంపురం పట్టణం సమీపంలో గోత బండ నలా వైపు బుధవారం తెల్లవారు జామున వాహనంలో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఎన్‌పోర్సుమెంట్, ఈబీ బృందం, సదర్ బరంపురం పోలీసు బృందాలకు పట్టుబడ్డారు. గజపతి జిల్లా అడవ మీదుగా బరంపురం పట్టణానికి రాత్రి వేళ కారులో చేరుకుని అక్కడ నుంచి రైలు మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు పథకం చేసినట్టు నిందితుడు అబ్కారీశాఖకు తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న కారులో 150 కిలోల గంజాయి ఉన్నట్టు ఎకై ్సజ్ అధికారులకు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి గజపతి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రైవర్, మరోకరు తప్పించుకున్నట్టు ఎకై ్సజ్ అధికారులు తెలియజేశారు. వీటి విలువ మార్కెట్‌లో రూ.15 లక్షలు ఉంటుందని జాయింట్ అబ్కారీ కమిషనర్ డంబురధర ఖండ తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి 3 మొబైల్స్, ఒక హీరో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో అబ్కారీ ఎస్‌ఐ అజిత్ కుమార్ నాయక్, ప్రదీప్ సామల్, కుముద ప్రదాన్, సరోజ్ స్వయిని, కపిలాష్ బత్రా, సౌమ్య రౌత్ పాల్గొన్నారు.


