సర్క్యూట్ కోర్టు ప్రారంభం
జయపురం: కొట్‌పాడ్ న్యాయవాదుల చిరకాల కోరిక నెరవేరింది. జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ కోర్టు ప్రాంగణంలో సర్క్యూట్ కోర్టును కొరాపుట్ జిల్లా జడ్జి ప్రదీప్‌కుమార్ మహంతి గురువారం ప్రారంభించారు. కొట్‌పాడ్‌లో సర్క్యూట్ కోర్టు నెలకొల్పాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు ఆమోదించగా ఎట్టకేలకు తమ డిమాండ్ కార్యరూపం దాల్చిందని న్యాయవాదులు తెలిపారు. సర్క్యూట్ కోర్టు సాధనలో కొట్‌పాడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మణి ప్రసాద్ పట్నాయక్ కృషిని న్యాయవాదులు కొనియాడారు. ప్రారంభ కార్యక్రమంలో మణి పట్నాయక్‌తో పాటు సీనియర్ న్యాయవాదులు పంకజ కుమార్ పాత్రో, స్వాదీనచంద్ర మహంతి, ఘనశ్యామ్ బిశాయి, లింగరాజ్ నాయిక్, శంకర ప్రసాద్ పండ, కిశోర్ మిశ్ర, గుప్త బెహర, దుర్గ నాయిక్, శ్రీమంత పండ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
కొట్‌పాడ్‌లో ప్రారంభమైన సర్క్యూట్ కోర్టు


