చేపల పెంపకంతో స్వయం ఉపాధి
● కోరుకొండలో భారీ మేళా
మల్కన్‌గిరి: చేపలు, పశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందవచ్చునని వక్తలు అన్నార. మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి కార్యాలయం ఆవరణలో రాష్ట్ర మత్స్య, పశుసంపద శాఖల ఆధ్వర్యంలో భారీ మేళాను నిర్వహించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు జితు బురుడీ ముఖ్యఅతిథిగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పశువైద్యాధికారి గగన్ చరయ్ నాయక్ వ్యవసాయం, ఆధునిక సాంకేతికత, చేపల పెంపకం, పశుపోషణను వివరించారు. ఈ సందర్భంగా పశు పోషణ, కోళ్లు, మేకలు, చేపల పెంపకం ద్వారా స్వయం ఉపాధి సాధించిన రైతులకు వెయ్యి రూపాయల చొప్పున చెక్‌లను అందజేశారు. గేదెలు, మేకలు, ఆవులు, కోళ్లకు చికిత్స కోసం పశువైద్య శాఖ తరఫున మొబైల్ అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచామని.. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నంబర్ 1962కి కాల్ చేయాలని గ్రూప్ వెటర్నరీ అధికారి అవినాశ్ మాఝి తెలిపారు.


