సంస్కృత ఉపాధ్యాయ అభ్యర్థుల నిరసన
భువనేశ్వర్:
ఔత్సాహిక సంస్కృత ఉపాధ్యాయ అభ్యర్థులు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓఎస్‌ఎస్‌సీ) కార్యాలయం ఎదురుగా నిరసన ప్రదర్శించారు. టీజీటీ సంస్కృత మెరిట్ జాబితా ప్రచురణలో జాప్యంపై తీవ్ర అసంతృప్తితో నిరసన వ్యక్తం చేశారు. సంస్కృతం మినహా అన్ని టీజీటీ పోస్టుల మెరిట్ జాబితా ప్రచురించారు. సంస్కృత టీజీటీ మెరిట్ జాబితా ఎందుకు ప్రచురించలేదో అస్పష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎస్‌ఎస్‌సీ కార్యాలయం ఎదురుగా మోకాళ్లు వేసి లెంపలేసుకుని విభిన్న శైలిలో శాంతియుతంగా నిరసన ప్రదర్శించారు.


