వినూత్న నిరసన
కటక్ రెవెన్షా విశ్వ విద్యాలయం విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. అధ్యాపకులు రోడ్డుపై పాఠాలు బోధించారు. యూనివర్సిటీలోని తరగతి గదులు సురక్షితంగా లేవని పేర్కొంటూ వారంతా ఇలా ఆందోళన చేపట్టారు. +3 ఆర్ట్స్ 2వ సంవత్సరం విద్యార్థులు గురువారం ఈ ప్రదర్శన నిర్వహించారు. తరగతి గదులు సురక్షితంగా లేనందున మరమ్మతులు చేయాలని సుదీర్ఘకాలంగా చేస్తున్న అభ్యర్థనలను అధికారులు పెడచెవిన పెట్టడంతో తరగతి గదులు వీడి క్యాంపస్ ప్రాంగణం అంగట్లో బైఠాయించి ఇలా నిరసన ప్రదర్శించారు.
భువనేశ్వర్


