చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి బలిదియాగుడా ఎస్.ఎస్.డి బాలికల ఉన్నాత పాఠాశాలలో 10వ తరగతి చదువుతున్న భారతి పూజారి (15) విద్యార్థిని కడుపు నొప్పితో మాత్తిలి ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. భారతికి బుధవా రం కంటి వాపు రావడంతో హాస్టల్ సిబ్బంది మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తీసుకెల్లి చికిత్స చేయించారు. మందులు కొలుగోలు చేసి తిరిగి హాస్టల్‌కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం భోజ నం తరువాత కంటివాపు మందులు వేసుకుంది. కాసేపటికే కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో వెంటనే తిరిగి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లా రు. ఇక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందింది. బాలిక మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక తల్లిండ్రులు మాత్తిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్ర దాన్ ఆరోగ్య కేంద్రానికి వచ్చి బాలిక మృతిపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రీపోర్ట్ వస్తే వివరాలు తెలుస్తాయని వైద్యులు అన్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
జయపురం: జయపురం బ్లాక్ విద్యాధికారి సచి న్‌కుమార్ ప్రదాన్‌కు కొలాబ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ బాధ్యతలను అదనంగా అప్పగించారు. కొలాగ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం శ్వేతలిని ప్రదాన్ బదిలీ కావటంతో ఆ స్థానం ఖాళీ అయింది. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు సచిన్ ప్రధాన్‌కు దేబాశిశ్ ప్రధాన్ బాధ్యతలు అప్పగించారు. విద్యావిభాగ అధికారి రాజేంద్రనారాయణ పాడీ, కొరాపుట్ జిల్లా నాన్ గజి టెడ్ సమస్వయ సంఘం అధ్యక్షుడు శశిభూష ణదాస్, విద్యా విభాగ జూనియర్ అధికారి నాగేశ్వరరావు తదితరులు సచిన్‌కు అభినందన లు తెలిపారు.
జయపురం: కొట్‌పాడ్ న్యాయవాదుల చిరకాల కోరిక నెరవేరింది. జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ కోర్టు ప్రాంగణంలో సర్క్యూట్ కోర్టును కొరాపుట్ జిల్లా జడ్జి ప్రదీప్ కమార్ మహంతి గురువారం ప్రారంభించారు. కొట్‌పాడ్‌లో సర్య్కూట్ కోర్టు నెలకొల్పాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నామని, ఎట్టకేలకు రాష్ట్ర హైకోర్టు ఆమోదించగా తమ డిమాండ్ కార్యరూపం దాల్చిందని న్యాయవాదులు తెలిపారు. సర్క్యూట్ కోర్టు సాధనలో కొట్‌పాడ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మణి ప్రసాద్ పట్నాయక్ కృషి గొప్పదని న్యాయవాదులు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మణి పట్నాయక్, సీనియర్ న్యాయవాదులు పంకజ కుమార్ పాత్రో, స్వాధీన చంద్ర మహంతి, ఘనశ్యామ్ బిశాయి, లింగరాజ్ నాయక్, శంకర ప్రసాద్ పండా, కిశోర్ మిశ్ర, గుప్త బెహర, దుర్గ నాయక్, శ్రీమంత పండా, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
నరసన్నపేట: మండలంలోని పారశిల్లి–రెల్లివలస గ్రామాల మధ్య కొత్త విద్యుత్ లైన్ పనులు జరుగుతున్న క్రమంలో గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభం పడి ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలో వ్యవసాయ మోటార్లకు ప్రత్యేక లైన్ వేసేందుకు రీవేంప్డ్ డెవలప్‌మెంట్ సెక్టార్ స్కీమ్(ఆర్‌డీఎస్‌ఎస్)లో భాగంగా రెండేళ్లుగా పనులు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం రెల్లివలస వద్ద ట్రాక్టర్ పైనుంచి విద్యుత్ స్తంభం కిందకు దించి పైకి ఎత్తుతున్న క్రమంలో టాక్టర్ పక్కకు ఒరిగిపోవడంతో స్తంభం పడి నడగాంకు చెందిన బానాల రాము(37) మృతి చెందగా, జోగి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెల్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేటకు తరలించారు. రాంబాబును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. కాగా, రాముకు రెండు నెలల క్రితమే కుమార్తె పుట్టింది. ఆ సంతోషంలో ఉండగానే ప్రమాదం జరగడంతో భార్య ఢిల్లీశ్వరి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నడగాం సర్పంచ్ జల్ల మాధురి, వైఎస్సార్ సీపీ నాయకులు లుకలాపు రవి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి


