మల్కన్‌గిరిలో సురభీ ఉత్సవాలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సదర్ బుటిగూడ ఉన్నత పాఠశాలలో గురువారం సురభీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు జిల్లా విద్యశాఖ అధికా రి చిత్తరంజన్ పాణిగ్రహి అధ్యక్షతన ఈ కార్యక్ర మం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సోమేశ్‌కుమార్ ఉపాధ్యాయ్ హాజరయ్యారు. ము ఖ్యంగా పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడం కో సం సురభీ ఉత్సవాలని పిలుస్తారు. పిల్లలకు ఆట లు, క్రీడలు, పాటల పోటీలు నిర్వహించి వారిలో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడమే సురభీ ఉత్సవాల వేదిక ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రదాన్, అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రదాన్, జిల్లా అదనపు వైద్యాకారి మంజులతా బోయి, మల్కన్‌గిరి సమితి విద్యాధికారి మామతా సోయి, చిత్రకొండ సమితి విద్యాధికారి గాయత్రీదేవి, ఖోయిర్‌పూట్ విద్యాధి కారి దిలీప్‌కుమార్ గోండో, ఇలా 7 సమితుల్లో అధికారులు పాల్గొన్నారు.
మల్కన్‌గిరిలో సురభీ ఉత్సవాలు


