ఘనంగా రఘునాథ్ పట్నాయక్ జయంతి
జయపురం: ఒడిశా మాజీ మంత్రి (ఆర్థిక, న్యాయశాఖ) రఘునాథ్ పట్నాయక్ రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయని వక్తలు అన్నారు. బుధవారం పట్నాయక్ జయంతిని జయపురంలో గల కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ భవనం, స్థానిక పవర్ హౌస్ కాలనీ కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహం వద్ద జయంతిని నిర్వహించారు. ఉత్కళ సమ్మిళిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కేవీకే సమాచార్ పత్రిక సంపాదకులు బినోద్ మహాపాత్ర మాట్లాడుతూ రఘునాథ్ పట్నాయక్ రాష్ట్ర ప్రగతికి, కొరాపుట్ జిల్లా ఉన్నతికి ఎనలేని కృషి చేశారన్నారు. ఉత్కళ సమ్మిళిని జిల్లా అధ్యక్షుడు మదన్ మోహన్ నాయక్, కన్వీనర్ నవీన మదల, ప్రతాప్ మదల, నవీన నాయక్, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షులు హరిహర కరసుధా పట్నాయక్, దుర్గా శతపతి, శివ పట్నాయక్, పియూష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రఘునాఽథ్ పట్నాయక్ విగ్రహానికి ఆయన పెద్ద కుమారుడు, కాంగ్రెస్ నేత బిరెన్ మోహన్ పట్నాయక్ నివాళులర్పించారు. డీసీసీ కార్యాయంలో పట్నాయక్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా రఘునాథ్ పట్నాయక్ జయంతి
ఘనంగా రఘునాథ్ పట్నాయక్ జయంతి


