చిత్తరంజన్‌కు అనురంగ అవార్డు
భువనేశ్వర్: హైటెక్ సంస్థలో ఒడియా భాష, సాహిత్య విభాగంలో సీనియర్ అధ్యాపకుడు, ప్రఖ్యాత అంతర్జాతీయ ఒడిస్సీ నృత్య కళాకారుడు డాక్టర్ చిత్తరంజన్ సహాణి ఈ ఏడాది అనురంగ–2025 సత్కారం పొందారు. భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ సౌజన్యంతో స్థానిక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైజర్) నిర్వహించిన అనురంగ్–2025 సాంస్కృతిక కార్యక్రమంలో ఆయనకు పురస్కారం అందజేశారు. తరాలు మారుతున్నా వెజ్ఞానిక ప్రపంచాన్ని కళలు మరియు సంస్కృతి, సంప్రదాయాలు ఆకర్షిస్తూనే ఉన్నాయి. నృత్యం, సంగీతం మరియు సాహిత్యం ఒక జాతి ఔన్నత్యానికి అద్దం పడతాయని ప్రముఖులు ప్రసంగంలో పేర్కొన్నారు. మన దేశంలో కళలు, సాంస్కృతిక విలువలు వారసత్వంగా కొనసాగడం విశేషం. కార్యక్రమంలో నైజర్ డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ హరేంద్రనాథ్ ఘోష్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రణయ్ కుమార్ స్వంయి, ముంబై హెచ్‌బీఎన్‌ఐ ప్రముఖుడు డాక్టర్ దీపా దత్తా, స్టూడెంట్ మినిస్ట్రీ ఆఫీసర్ డాక్టర్ అశోక్ మహాపాత్రో, అనురంగ 2025 సాంస్కృతిక ఉత్సవం చైర్మన్ డాక్టర్ సరలాశ్రిత్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
చిత్తరంజన్‌కు అనురంగ అవార్డు


