కిటకిటలాడుతున్న శ్రీక్షేత్రం
భువనేశ్వర్: పవిత్ర కార్తీక పూర్ణిమ పురస్కరించుకుని భక్తులు, యాత్రికుల తాకిడితో శ్రీక్షేత్రం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో పూరీలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా బుధవారం భక్తులకు శ్రీమందిరం రత్న వేదికపై మూల విరాటులు స్వర్ణ శోభతో దర్శనం ఇవ్వనున్నారు. ఈ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. వారందరికీ క్రమబద్ధమైన దర్శనం కల్పించేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 45 ప్లాటూన్ల పోలీసు సిబ్బందిని మోహరించనున్నట్లు పూరీ కలెక్టరు ప్రతీక్ సింగ్ తెలిపారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా నాయక్ ప్లాజా స్క్వేర్ వరకు బారికేడ్ వ్యవస్థని పొడిగించారు. మెడికల్ స్క్వేర్ నుంచి వాహన రహిత జోన్‌గా ప్రకటించారు. సముద్ర తీరం మరియు పట్టణవ్యాప్తంగా పవిత్ర పుష్కరిణుల దగ్గర లైఫ్‌గార్డ్‌లతో 2 చొప్పున ఒడ్రాఫ్ బృందాల్ని నియమించారు. భక్తులు సింహద్వారం గుండా ప్రవేశించి, దర్శన అనంతరం మిగిలిన మూడు ద్వారాలు నుంచి బయటకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారన్నారు.
నేడు కార్తీక పూర్ణిమ


