కలిమెలలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ–79 పోలీసుస్టేషన్ ఐఐసీ చంద్రకాంత్ తండి ఆధ్వర్యంలో సోమవారం సైబర్ సెక్యూరిటీ అవగాహన కర్యక్రమాన్ని ఎంవీ–79 గ్రామంలో గల శ్యామ్ ప్రసాద్ జూనియర్ కళాళాల అవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలు, మోసాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ముబైల్ ఫోన్ ద్వారా సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్ మోసాలు, కేవైసీ ఆప్‌డేట్ పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ ఉద్యోగ వాగ్దానాల ద్వారా ప్రజాలను దోచుకుంటున్న వైనంపై అవగాహన కల్పించారు . అలానే ప్రభుత్వ చర్యలలో భాగంగా సైబర్ పోలీసుల బలోపేతం, సురక్షిత డిజిటల్ వాతావరణ నిర్మాణంపై కూడా వివరించారు. కాలేజ్ విద్యార్థులతో ‘భికారీ చేసిందే సైబర్ మోసం ‘అనే అంశంపై వీధి నాటకం ప్రదర్శించారు, సైబర్ సెక్యూరిటీ అభియాన్–ఒడిశా 2025 తరఫున రూపొందించిన ప్రామాణిక వీడియోను ప్రదర్శించారు.
కలిమెలలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన


