రాయగడ బ్లాక్‌లో శిశు మహోత్సవం, సురభి పోటీలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్‌లో సమతి స్థాయి శిశు మహోత్సవం, సురభి 2025 పోటీలు స్థానిక హైస్కూల్ మైదానంలో సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా రాయగడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, బ్లాక్ విద్యాధికారి టి.కిశోర్ కుమార్, ఏడీఈవో జుధిష్టర్ బెహారా, అన్ని విద్యాలయాల గైడ్ టీచర్లు హాజరయ్యారు. సురభి కార్యక్రమంలో పిల్లలు వివిధ జానపద కళా నృత్యాలు, ఆధునిక డ్యాన్సులు ప్రదర్శించారు. అలాగే డిబేటింగ్, వక్తృత్వ, ప్రబంధాలు, క్విజ్, చిత్రలేఖనం పోటీలో 12 క్లస్టర్ల నుంచి 250 మంది పిల్లలు పాల్గొన్నారు. పోటీల అనంతరం విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్ చేతులమీదుగా అందజేశాు. బ్లాక్ స్థాయి సురభి పోటీలలో విజేతలు జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్టు ప్రధాన ఉపాధ్యాయులు మనోజ్ బెహారా తెలిపారు.
రాయగడ బ్లాక్‌లో శిశు మహోత్సవం, సురభి పోటీలు


