● ఉత్సాహంగా 5కే రన్
రాయగడ: సైబర్ సేఫ్టీ క్యాంపైన్‌లో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆదివారం స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యఅతిథిగా ఎస్‌పీ స్వాతి ఎస్ కుమార్ రన్ ను ప్రారంభించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం జరిగిన సభలొ ఎస్‌పీ స్వాతి మాట్లాడుతూ.. సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్న యువతకు అవగాహన కల్పించి వారిలో చైతన్య పరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రన్‌లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, పోలీస్ అధికారులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
● ఉత్సాహంగా 5కే రన్


