పడిపోవడానికి సిద్ధంగా చెట్టు!
● పట్టించుకోని అధికారులు
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు పట్ల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. జిల్లా కేంద్రం నుంచి నువాబందు వీధి మీదుగా వేళ్లే మార్గంలో కోర్టు పాత భవనాల సముదాయం వద్ద ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఓ చెట్టు ఒరిగి పోయింది. పిట్ట గోడను శిథిలం చేస్తూ రోడ్డు మీద పడడానికి సిద్ధంగా ఉంది. ఈ మార్గంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి, జిల్లా కోర్టులకు, నందాహండి సమితికి వెళ్లడానికి నిత్యం వాహనాలు వెళ్తుంటాయి. ఏక్షణంలో నైనా చెట్టు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాతకోర్టు వద్ద కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్టు


