ఇందిరా గాంధీకి ఘన నివాళి
పర్లాకిమిడి: మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతిని సోండివీధి కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ ఉత్తమ పరిపాలన అధ్యక్షురాలిగా పేరొందారని, ఆమె ఆచరణలో మనందరం నడవాలని దాశరథి గోమాంగో అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా, మున్ను మహరాణా, ఎస్.పాపారావు, సూర్యనారాయణ పాత్రో, అశోక్ అధికారి, రాజపాత్రో, తదితరులు పాల్గొన్నారు.
35 యూనిట్ల రక్తం సేకరణ
రాయగడ: స్థానిక ప్రభుత్వ హస్పిటల్‌లో గల రక్తదాన కేంద్రం వద్ద శుక్రవారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 35 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వహిందు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబూరావు మహంతి మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. విశ్వహిందు పరిషత్ జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు ప్రపుల్ల పాత్రో, కార్యదర్శి గోపీనాథ్ గౌడొ, అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భొగిలి రాజేష్, బిల్లా, తదితరులు పాల్గొన్నారు.
మలేరియాతో ఆశ్రమ
పాఠశాల విద్యార్థిని మృతి
రాయగడ: సదరు సమితి బాయిసింగిలో గల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న నందిని తాడింగి అనే విద్యార్థిని మలేరియా వ్యాధితో మృతి చెందింది. అక్టోబర్ 29 వ తేదిన అస్వస్థతకు గురైన నందినికి ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు ఆశ్రమంలో గల మలేరియా కిట్ ద్వార రక్త నమూనాను సేకరించి పరీక్షంచగా మలేరియా సొకినట్లు గుర్తించారు. దీంతో విషయాన్ని నందిని కుటుంబీకులకు తెలియజేశారు. అనంతరం ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన నందిని ఆరోగ్య పరిస్థితి కొంతమేర మెరుగుపడటంతో తిరిగి హాస్టల్‌కు తరలించారు. కానీ 24 గంటల్లో మళ్లీ అనారోగ్యం రావడంతో తండ్రి రాజారావు ఆమెను తన స్వగ్రామం డంగిజొడికి తీసుకువెళ్లాడు. అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక గురువారం రాత్రి నందిని మృతి చెందినట్లు సమాచారం.
ఆరు కిలోల గంజాయి
పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పోలీసులు ఐఐసీ ముకుందో మేల్క ఆదేశాల మేరకు యంపీవీ 31 గ్రామం సమీపంలో గురువారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఓ బస్తాను భుజాన వేసుకుని వస్తున్నారు. పోలీసులు వారిని ఆపి ప్రశ్నించగా వారు తడబడ్డారు. వారి వద్ద ఉన్న బస్తాను తెరిచి చూడగా అందులో గంజాయి కనిపించింది. వారు తెలంగాణకు తరలించేందుకు వచ్చారు. పతిపముల వంశీ, రాచర్ల వంశీ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి నుంచి ఆధార్ కార్డులు, మొబైల్ ఫోన్లు, రూ.6వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇందిరా గాంధీకి ఘన నివాళి
ఇందిరా గాంధీకి ఘన నివాళి


