● ఐక్యతే మన నిబద్ధత
భువనేశ్వర్: జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రత పరిరక్షణ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని శుక్రవారం దేశ వ్యాప్తంగా నిర్వహించే జాతీయ సమైక్యత దినం వేడుకల్లో భాగంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ను పురస్కరించుకుని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి శుక్రవారం అభిషేక్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్ భవన్ అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించగా.. కళింగ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రజలతో సమైక్యత భావాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.
● ఐక్యతే మన నిబద్ధత


