మహిళ మృతదేహం లభ్యం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సదర తహసీల్ పరిధిలో పంచాయతీ కార్యాలయ సమీపంలో రాజేష్ బిస్వాస్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. రాజేష్ భార్య శంకరి బిస్వాస్ శుక్రవారం ఉదయం తన ఇంటిలో ఉరి వేసుకున్నారు. మృతదేహాన్ని చూసి మల్కన్‌గిరి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఐఐసీ రీగాన్‌కీండో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి విచారించారు. మృతురాలి తల్లిదండ్రులు కలిమెల సమితి ఎంపీవీ 23 గ్రామం నుంచి వచ్చి తమ బిడ్డను హత్య చేశారని ఫిర్యాదు చేశారు. భార్య మృతదేహాన్ని అలా చూసి భర్త రాజేష్ ఆయన తల్లి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మహిళ మృతదేహం లభ్యం


