15 లక్షల హెక్టార్లకు సాగునీరు లక్ష్యం: ముఖ్యమంత్రి
విలేకర్లతో ముఖ్యమంత్రి సమావేశం
భువనేశ్వర్: రాష్ట్రంలో 15 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకు జల వనరుల విభాగం సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ దిశలో సమర్థంగా మలిచేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర జల వనరుల శాఖ పని తీరును ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ భవన్ సముదాయంలో రాష్ట్ర జల వనరుల సమాచారం కేంద్రం సందర్శించారు. రాష్ట్రంలో జలాశయాలు, నదులలో తాజా నీటి మట్టాలను పర్యవేక్షణని ముఖ్యమంత్రి సమీక్షించారు. వివిధ ఉప విభాగాలలో ఇంజినీర్లు, సిబ్బందితో సంభాషించారు. 2029–30 నాటికి రాష్ట్రంలోని 15 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. దీనితో పాటు, జల వనరులకు చిట్ట చివర వరకు సాగు నీరు చేరేలా చూస్తున్నామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విభాగాన్ని మరింత సమర్థమైన, స్మార్ట్ కార్యాలయంగా మారుస్తామని విలేకరులకు వివరించారు. అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ పాఢి మరియు ఇతర సీనియర్ అధికారులు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
15 లక్షల హెక్టార్లకు సాగునీరు లక్ష్యం: ముఖ్యమంత్రి


