
రాయగడలో విజృంభిస్తున్న అతిసారం
రాయగడ: జిల్లాలో అతిసారం వ్యాధి చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొలనార సమితి సూరి, కూలి, పెంట, రాయగడ సమీపంలో గల పితామహల్ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాధి బారిన పడిన రోగులు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజూ 8 మంది వరకు అతిసారం వ్యాధితో వార్డుల్లో చేరుతున్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అందాక ఇంటికి వెళ్లిపోతున్నారని జిల్లా అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ మిశ్రో తెలిపారు. తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నట్లు వివరించారు.
140 మందికి
ఉచిత వైద్య పరీక్షలు
జయపురం: దక్షిణ ఆయుర్వేద వికాస పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ఏక్టివ్ లైఫ్ ఫిజియోథెరిఫీ కేంద్రంలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్వర్గీయ మీన కేతన పండ స్మృతి కమిటీ సహకారంతో నిర్వహించిన శిబిరంలో డాక్టర్లు సుదర్శణ గౌఢ, బినోద్ బిహారి రథ్, ప్రశాంత్ కుమార్ ప్రధాన్, మనోజ్ కుమార్ ప్రధాన్ రోగులకు వైద్య పరీక్షలు జరిపారు. రోగులకు అవసమైన ఆయుర్వేద మందులు ఉచితంగా ఇచ్చి వాటిని వాడే విధానాన్ని వివరించారు. శిబిరంలో 140 మంది రోగులకు వైద్యపరీక్షలు జరిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు. కవిరాజ్ క్షేత్రవాసీ పండ, భవానీచరణ ఆచార్య, సత్యనారాయణ పరిచ, శ్రీనివాస పాత్రో, కాళీచరణ మహరాణ, రాజేంద్ర జెన, రంజన్ కుమార్ గౌడ్, డాక్టర్ శ్రీనివాస పాత్రో సహకరించారు. ఆయుర్వేద వైద్యులు పమేశ్వర పాత్రో ధన్యవాదాలు తెలియజేశారు.
జెడ్పీ చైర్‌పర్సన్‌కు తీవ్ర అస్వస్థత
● మెడికల్ కళాశాలలో చేరిక
కొరాపుట్: కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు కొరాపుట్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న కొరాపుట్ మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడల్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం రఘురాం మీడియాతో మాట్లాడుతూ.. సస్మితా మెలకపొట్టలో కణితి వంటి రాయి ఏర్పడిందన్నారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె కోలుకున్నారని రఘురాం పేర్కొన్నారు.
జనం చెంతకు జగన్నాథుడు
పర్లాకిమిడి: స్థానిక గుండిచా మందిరంలో సోమవారం నృసింహా, వరాహ అవతారంలో జగన్నాథ, బలరాముడు భక్తులకు దర్శనం ఇచ్చారు. గుండిచా వెలుపల భక్తులు స్వామి వారి ఓబడా ప్రసాదాన్ని స్వీకరించేందుకు బారులు తీరారు. మంగళవారం గుండిచా మందిరంలో హిరా పంచమి వేడుక జరుగనుంది.
భక్తులకు దర్శనం..
జయపురం: జయపురం గుండిచా మందిరంలో ఆదివారం రాత్రి జగన్నాఽథుడు, బలభద్ర దేవతా మూర్తులు మత్స్య, కశ్యప అవతారాల లో భక్తులకు దర్శనమిచ్చారు. అవతార మూ ర్తులను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. జయపురంలో ఒక రోజు ఆలస్యంగా రథయా త్ర ప్రాంభం కావటం వలన రెండు అవతారా ల్లో దేవతా మూర్తులు ఒకే రోజు భక్తులకు దర్శనమిచ్చారు.

రాయగడలో విజృంభిస్తున్న అతిసారం

రాయగడలో విజృంభిస్తున్న అతిసారం