
లైవ్ స్టాక్ ద్వారా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు
విజయనగరం అర్బన్: మాంసం, గుడ్లు, పాడి ఉత్పత్తి ద్వారా జిల్లాలో అభివృద్ధి సూచీలను పెంచడానికి తగు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ సూచించారు. జిల్లా అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయ అనుబంధ రంగంలో లైవ్‌స్టాక్ పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పశుసంవర్థక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల మహిళా సమాఖ్య ద్వారా ప్రతి మండలంలో గుడ్లు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని డీఆర్‌డీఏ పీడీ కల్యాణ చక్రవర్తికి సూచించారు. అందుకు కావాల్సిన సాంకేతికపరమైన సహకారాన్ని పశుసంవర్థక శాఖ అధికారులు అందించాలని కోరారు. అందుకోసం రానున్న 10 రోజుల్లో ప్రణాళికలు వేసి ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా నియోజకవర్గానికి ఒక మహిళా ఎంట్రప్రెన్యూర్‌ను గుర్తించి గొర్రెలు, మేకల యూనిట్ల ఏర్పాటుకు కూడా సబ్సిడీపై రుణాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లో పశుగ్రాసం కోసం ప్రతిపాదనలు పంపారని అన్ని మండలాలకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇంకా ఏ రకంగా లైవ్‌స్టాక్‌ను పెంచగలమో చర్చించి ప్రతిపాదననలతో రావాలని పశువైద్యాధికారులకు సూచించారు. సమావేశంలో పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ వైవీ రమణ, ముఖ్యప్రణాళిక అధికారి బాలాజీ, డీఆర్‌డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, మండల పశువైద్యాధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్