వైభవంగా పైడమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పైడమ్మ జాతర

Dec 7 2025 7:18 AM | Updated on Dec 7 2025 7:18 AM

వైభవం

వైభవంగా పైడమ్మ జాతర

వైభవంగా పైడమ్మ జాతర పెడన: పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీపైడమ్మ అమ్మవారి జాతర వైభవంగా కొనసాగుతోంది. మూడో రోజైన శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానికులు ఎండ్లబండ్లు, ట్రాక్టర్లుపై శిడిబండ్లను కట్టి పట్టణంలో ఊరేగుతూ నృత్యం చేస్తూ పసుపు జల్లుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ గోవాడ వెంకటకృష్ణా రావుతో పాటు దేవదాయ శాఖ సిబ్బంది, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసుల పర్యవేక్షణలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కటకం నాగ కుమారి, కటకం ప్రసాద్‌ దంపతులు అమ్మ వారిని దర్శించుకున్నారు.

నెమలి ఆలయ హుండీ కానుకల లెక్కింపు

తిరువూరు: గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసిన శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి శనివారం వరకు ఆలయంలోని ఆరు హుండీలలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.18,46,236 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ సంధ్య తెలిపారు. బంగారం 10.880 గ్రాములు, వెండి కేజీ 778 గ్రాముల 400 మిల్లీగ్రాములు, 26 యూఎస్‌ డాలర్లు కూడా సమకూరాయని వివరించారు. కానుకల లెక్కింపును దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ షన్ముగం, గన్నవరం తనిఖీ అధికారి అనురాధ, శ్రీవేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ కావూరి శశిరేఖ పర్యవేక్షించారు.

ముగిసిన అంతర కళాశాలల వాలీబాల్‌ పోటీలు

కేతనకొండ(ఇబ్రహీంపట్నం): జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో స్థానిక ఆర్కే ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన అంతర కళాశాలల మహిళల వాలీబాల్‌ పోటీలు శనివారం ముగిశాయి. ఈ టోర్నీలో 20 కళాశాల క్రీడాకారులు పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో సెయింట్‌ ఆన్స్‌ (చీరాల) ప్రథమ స్థానం, సెయింట్‌ మేరీస్‌ (చేబ్రోలు) ద్వితీయ స్థానంలో నిలిచాయి. శ్రీవిష్ణు (భీమ వరం), సెయింట్‌ మేరీస్‌ (బుడంపాడు) కళాశాల సంయుక్తంగా తృతీయ స్థానం దక్కించు కున్నాయి. విజేతలకు కళాశాల చైర్మన్‌ ఎం.ఎం. కొండయ్య, కోశాధికారి గౌరీ అమర్నాథ్‌ జ్ఞాపి కలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ టోర్నీలో సత్తాచాటిన క్రీడాకారులతో యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశారు. ప్రిన్సిపాల్‌ రామ కృష్ణయ్య, జేఎన్టీయూ ఐసీటీ కార్యదర్శి జి.పి.రాజు, పీడీలు శివశంకర్‌, వి.వి.మురళీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు అవసరం

మచిలీపట్నంఅర్బన్‌: ఐదేళ్ల లోపు ప్రతి చిన్నా రికీ పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమని కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ పి.యుగంధర్‌ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పల్స్‌ పోలియో శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకుండా ఉండేందుకు పల్స్‌ పోలియో రెండు విడతలు కీలకమని డాక్టర్‌ యుగంధర్‌ తెలిపారు. జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ప్రేమచంద్‌ మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీన జరగనున్న పల్స్‌ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, జాగ్రత్తలు, ఫీల్డ్‌ స్థాయి చర్యలను వివరించారు. ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు అందేలా బూత్‌ స్థాయిలో సిబ్బంది సమన్వయం తప్పనిసరి అని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యాధికారులు, డాక్టర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

వైభవంగా పైడమ్మ జాతర 1
1/3

వైభవంగా పైడమ్మ జాతర

వైభవంగా పైడమ్మ జాతర 2
2/3

వైభవంగా పైడమ్మ జాతర

వైభవంగా పైడమ్మ జాతర 3
3/3

వైభవంగా పైడమ్మ జాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement