15 నుంచి తిరుపతమ్మ దీక్షలు | - | Sakshi
Sakshi News home page

15 నుంచి తిరుపతమ్మ దీక్షలు

Dec 2 2025 9:46 AM | Updated on Dec 2 2025 9:48 AM

ఫిబ్రవరి ఒకటో తేదీన విరమణ..

ఈ ఏడాది షెడ్యూల్‌ ఇది..

15 నుంచి 21వ తేదీ వరకూ ఆలయంలో మండల దీక్షలు తీసుకోవచ్చు.

జనవరి ఒకటో తేదీ పదో తేదీ వరకూ అర్ధమండల దీక్షలు స్వీకరించవచ్చు.

11రోజుల దీక్ష జనవరి 16 నుంచి 20వ తేదీ వరకూ తీసుకోవచ్చు.

మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా వేల సంఖ్యలో అమ్మవారి దీక్షలు తీసుకుంటున్నారు. దీక్ష తీసుకునేవారు ఆలయానికి వచ్చేటప్పుడు ఎర్రని వస్త్రాలు, పసుపు కండువా ధరించి, మాలలు, టికెట్టు తీసుకొని రావాలి. అమ్మవారు భక్తులు అందరినీ చల్లగా చూస్తారు. స్వాములు దీక్షలు విరమించేందుకు 2026, ఫిబ్రవరి ఒకటో తేదీని నిర్ణయించాం.

– మర్రెబోయిన గోపిబాబు,

ఆలయ ప్రధానార్చకుడు

పెనుగంచిప్రోలు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి మండల దీక్షా మాలాధారణ కార్యక్రమం ఈఏడాది డిసెంబర్‌ 15న తెల్లవారుజామున ఆలయంలో ప్రారంభం కానుంది. ఈ దీక్షను ఆలయంలో మొదటి సారిగా 1990లో ప్రారంభించారు. శబరిమలలో కొలువై ఉన్న శ్రీ అయ్యప్పస్వామి, విజయవాడలో వేంచేసి ఉన్న శ్రీకనదుర్గమ్మవారి భవానీ మాల అనంతరం ఎక్కువ మంది భక్తులు శ్రీతిరుపతమ్మవారి మాల వేసుకుంటున్నారు. మొదట 46 మందితో దీక్ష ప్రారంభం కాగా, ఏడాదికేడాది పెరుగుతూ ప్రస్తుతం ఏటా 20వేల నుంచి 25 వేల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల వేసుకుంటున్నారు. మొదట అర్చకులు దివంగత మర్రెబోయిన రామదాసు గ్రామపెద్దలు, ఆలయ అధికారులు, వామకుంట్ల పీఠాధిపతి రామడుగు నరసింహాచార్యులు సమక్షంలో అమ్మవారి సన్నిధిలో మాల వేసుకున్నారు. గతంలో పెనుగంచిప్రోలు అమ్మవారి సన్నిధిలోనే స్వాములు మాల వేసుకొని దీక్షలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు గురుస్వాములు వారి గ్రామాల్లోనే మాలలు వేస్తున్నారు. అయితే దీక్ష అనంతరం తిరుముడి సమర్పణకు మాత్రం పెనుగంచిప్రోలు అమ్మవారి సన్నిధికి తప్పక వస్తారు. గతంలో మండల దీక్ష, అర్ధమండల దీక్ష మాత్రమే ఉండగా గత ఏడాది నుంచి కొత్తగా 11 రోజుల దీక్ష కూడా ఆలయ వర్గాలు ఏర్పాటు చేశాయి.

15 నుంచి తిరుపతమ్మ దీక్షలు 1
1/2

15 నుంచి తిరుపతమ్మ దీక్షలు

15 నుంచి తిరుపతమ్మ దీక్షలు 2
2/2

15 నుంచి తిరుపతమ్మ దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement