ఎన్టీఆర్ భరోసాతో పేదల జీవితాలకు చేయూత
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీన ఠంచనుగా పింఛన్లు అందిస్తోందని, ఎన్టీఆర్ భరోసా పథకంతో పేదల జీవితాలకు చేయూత లభిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద సోమవారం విజయవాడ గులాబీతోటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్ల పంపిణీ తీరుతెన్నులను పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ జిల్లాలో 2,28,968 మంది పెన్షనర్లకు రూ.98.91 కోట్ల మేర పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో
కలెక్టర్ లక్ష్మీశ


