జోగి రమేష్ పై కొనసాగుతున్న వేధింపుల పర్వం
ఇబ్రహీంపట్నం (మైలవరం): చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జోగి రమేష్‌పై వేధింపులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం కేసులో ఇప్పటికే జోగి రమేష్, ఆయన సోద రుడు జోగి రాముఅను అక్రమంగా అరెస్టు చేయగా, తాజాగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఎకై ్సజ్ శాఖ పోలీసులు విచారణకు హాజరు కావాలని సోమవారం రాత్రి నోటీసులు అందజేశారు. ఈ నెల 3వ తేదీన భవానీపురం ఎకై ్సజ్ శాఖ పోలీస్ స్టేషన్‌లో విచారణ నిమిత్తం హాజరు కావాలని జోగి రమేష్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్‌కుమార్, జోగి రాము కుమారులు జోగి రాకేష్, జోగి రామ్మోహన్‌కు నోటీసులు అందజేశారు.
రమేష్, రాము కుమారులకు
నోటీసులు


