న్యూస్‌రీల్
రోడ్లపైనే ధాన్యం రాశులు గోనెసంచులు, రవాణా వాహనాల లభ్యత కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పంట తడిసిపోకుండా పరదాలు కప్పుకొనే పనుల్లో రైతులు దిత్వా తుపానుతో రైతుల్లో ఆందోళన
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
రైతుల్లో ఆందోళన
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ అన్నప్రసాద వితరణకు ఆదివారం తెలంగాణలోని మేడ్చర్ల వాస్తవ్యులు ఎంవీ రామ్‌శెట్టి దుర్గాప్రసాద్ రూ.1,00,000 విరాళంగా అందజేశారు.
నందిగామ రూరల్: నందిగామలో హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో అయ్యప్ప మహా పడిపూజను కనులపండువగా నిర్వహించారు.
కంకిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దిత్వా తుపానుగా మారడంతో రైతన్న దిగులు పడుతున్నాడు. తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. బందరు, గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం నుంచే మోస్తరు వర్షం కురుస్తోంది. సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారుతుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోత కోసి మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన పంట వర్షం పాలు కాకుండా ఉండటానికి రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది.
3.83 లక్షల ఎకరాల్లో సాగు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.54 లక్షల హెక్టార్లలో (3.83 లక్షల ఎకరాలు) వరి సాగు చేపట్టారు. ప్రధానంగా ఎంటీయూ, బీపీటీ, స్థానిక వరి వంగడాలను రైతులు ఎంపిక చేసుకుని సాగు చేశారు. పదిహేను రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోతలు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకూ 287 పీపీసీ క్లస్టర్ల పరిధిలో ధాన్యం సేకరణ జరుగుతోంది. 1.50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు.
రోడ్లపైనే ధాన్యం రాశులు
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఎక్కడ చూసినా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రోడ్డు మార్జిన్లు, రియల్ వెంచర్లలో ధాన్యం కుప్పలుగా పోసి ఉంచారు. మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్నా గోనె సంచులు, రవాణా వాహనాల లభ్యత సజావుగా సాగక పోవడంతో ధాన్యం ఎక్కడిదక్కడే నిలిచిపోతోంది. ఈ నెల మూడో వారంలోనే తుపాను హెచ్చరికలు ఉన్నా వాతావరణ పరిస్థితులు సహకరించడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈసారి మాత్రం వాతావరణం ప్రతికూలంగా మారింది.
గోరుచుట్టుపై రోకలి పోటు చందం
పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించే క్రమంలో దిత్వా తుపాను గోరుచుట్టుపై రోకలి పోటు చందంగా మారిందని రైతులు వాపోతున్నారు. చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో మోంథా తుపాను విరుచుకుపడింది. జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సుమారు 40 వేల హెక్టార్లలో (1.10 లక్షల ఎకరాలు) వరి పంట నేలవాలింది. నేలవాలిన పంట వర్షం నీటిలో నాని కంకులు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా ధాన్యం కంకులు మొలకెత్తడం, మడమతాలు, మానుగాయ ఏర్పడటంతో రైతులు ఆర్థికంగా నష్టాన్ని చవిచూశారు. ఎకరాకు రూ 35 వేలు పెట్టుబడులు పెట్టగా, కౌలు చెల్లింపులు, పెట్టుబడులు అన్నా చేతికి దక్కితే చాలని భావించారు. ఆఖరికి దిగుబడులు సైతం ఎకరాకు 28 బస్తాలకు (బస్తా 75 కిలోలు) మించి వచ్చిన దాఖలాలు లేవు.
మరోసారి ప్రకృతి కన్నెర్ర
అందిన కాడికి పంటను మద్దతు ధరకు అమ్ముకుందామని ఆశించిన తరుణంలో దిత్వా తుపాను రూపంలో మరోమారు ప్రకృతి కన్నెర్ర చేయడం తో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే తేమ శాతం ఎక్కువగా ఉందని సాకుగా చూపి బస్తాకు రూ.1,500 మించి ధర దక్కక రైతులు అల్లాడుతున్నారు. ఈ సమయంలో ధాన్యం నిమ్ముకోవడం, తేమశాతం పెరగడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. తుపాను బారిన పంట పడకుండా కాపాడుకునే చర్యల్లో అన్నదాతలు నిమగ్నమవుతున్నారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


