ప్రశాంతంగా ఆలిండియా బార్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఆలిండియా బార్‌ పరీక్ష

Dec 1 2025 7:18 AM | Updated on Dec 1 2025 7:18 AM

ప్రశా

ప్రశాంతంగా ఆలిండియా బార్‌ పరీక్ష

ప్రశాంతంగా ఆలిండియా బార్‌ పరీక్ష ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ బాలరాజు ముగిసిన ఫుట్‌బాల్‌ పోటీలు అంతర్‌ జిల్లాల రగ్బీ పోటీలు ప్రారంభం

జూపూడి(ఇబ్రహీంపట్నం): ఆలిండియా బార్‌ పరీక్ష జూపూడి నిమ్రా కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కళాశాలలో పరీక్ష రాసేందుకు 545 మందిని కేటాయించగా, 538 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు అభ్యర్థులు గైర్హాజరయ్యారన్నారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే అభ్యర్థులు తప్పనిసరిగా ఆలిండియా బార్‌ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉండటంతో ఈ పరీక్షకు ఇటీవల కాలంలో డిమాండ్‌ పెరిగింది.

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఏపీ శాఖ అధ్యక్షుడిగా రాజంపేటకు చెందిన డాక్టర్‌ ఎస్‌.బాలరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు జనరల్‌ సెక్రటరీగా విజయవాడకు చెందిన డాక్టర్‌ మోటూరి సుభాష్‌చంద్రబోస్‌, ఫైనాన్స్‌ సెక్రటరీగా డాక్టర్‌ తుమ్మల కార్తీక్‌ బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ ఎల్‌.కల్యాణ్‌ప్రసాద్‌ (విశాఖపట్నం), డాక్టర్‌ పి.వి.మధుసూదనాచారి(విజయవాడ), డాక్టర్‌ ఎ.వి.సుబ్బారెడ్డి (మదనపల్లి), జాయింట్‌ సెక్రటరీలుగా డాక్టర్‌ జె.ఎస్‌.శివకుమార్‌ (కోనసీమ), డాక్టర్‌ మణిబాబు(ఒంగోలు), డాక్టర్‌ బి.ఇ.పానిల్‌ కుమార్‌(నంద్యాల), డాక్టర్‌ జి.సునీల్‌(రాజంపేట) బాధ్యతలు స్వీకరించారు. వీరిని ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ శ్రీహరిరావు, పూర్వ ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జి.సమరం అభినందించారు. ఐఎంఏ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న డాక్టర్‌ బాలరాజు మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, ఆస్పత్రుల రక్షణ చట్టాన్ని కఠిన తరం చేయాలని పేర్కొన్నారు.

మైలవరం: ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన మైలవరంలోని డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో వారం రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి డీఏ ఫుట్‌బాల్‌ లీగ్‌ టోర్నమెంట్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. పెన్నా ఎఫ్‌సీ, తుంగభద్ర ఎఫ్‌సీ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో రెండు జట్లు చెరో రెండు గోల్స్‌ చేయడంతో మ్యాచ్‌ డ్రా అయింది. అనంతరం రెండు జట్లకు పెనాల్టీలు ఇవ్వగా 2–3 గోల్స్‌ తేడాతో పెన్నా ఎఫ్‌సీ విజయం సాధించి మొదటి బహుమతి గెలుచుకుంది. డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి, లకిరెడ్డి జయ ప్రకాష్‌రెడ్డి, లయన్‌ ఎస్వీఎన్‌ నివృతరావు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత డీఎస్‌డీఓ బి.సుధాకర్‌, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శేషగిరిరావు, ఈసీ మెంబర్‌ చక్రవర్తి, బుజ్జి, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గన్నవరం: జిల్లా పరిషత్‌ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏపీ అంతర్‌ జిల్లాల రగ్బీ అండర్‌–14 చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. 13 జిల్లాల బాల బాలికల జట్టు పాల్గొన్నాయి. తొలిరోజు బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కృష్ణాజిల్లా జట్టుతో పాటు నెల్లూరు, కడప, కర్నూలు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో తూర్పుగోదా వరి, కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం జట్లు సెమీఫైనల్‌కు చేరాయి. రెండో రోజు పోటీలు ముగిసిన తర్వాత బాల, బాలికలను రాష్ట్ర జట్లకు ఎంపిక చేస్తారని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి జి.రాంబాబు తెలిపారు. రగ్బీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామానుజం, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి అరుణ, వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేవీఆర్‌ కిషోర్‌, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నేతలు తోట అజయ్‌కుమార్‌, సత్యప్రసాద్‌, వర్మ, నియోజకవర్గ క్రీడా సమన్వయకర్త డి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా    ఆలిండియా బార్‌ పరీక్ష 
1
1/2

ప్రశాంతంగా ఆలిండియా బార్‌ పరీక్ష

ప్రశాంతంగా    ఆలిండియా బార్‌ పరీక్ష 
2
2/2

ప్రశాంతంగా ఆలిండియా బార్‌ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement