మానసికోల్లాసానికి క్రీడలు దోహదం
మైలవరం: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల హానరరీ చైర్మన్ లకిరెడ్డి జయప్రకాష్‌రెడ్డి తెలిపారు. కళాశాలలో జేఎన్‌టీయూకే సెంట్రల్ జోన్ వాలీబాల్ ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ పోటీలు శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నెల 29, 30 రెండు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుంటారని చెప్పారు. కళాశాలలో క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్‌లో ఆయా జిల్లాలకు చెందిన 44 ఇంజినీరింగ్ కళాశాలల వాలీబాల్ టీమ్‌లు పాల్గొంటున్నాయని తెలిపారు. డాక్టర్ జీపీ రాజు మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమ శిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు. క్రీడలు ద్వారా శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉంటారన్నారు. ఆయా టీమ్‌ల నుంచి యూనివర్శిటీ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన టీమ్ జేఎన్‌టీయూకే కాకినాడలో డిసెంబర్ 10వ తేదీ నుంచి జరగబోయే సౌత్ జోన్ ఆలిండియా టోర్నమెంట్‌లో పాల్గొంటుందని వివరించారు. కళాశాల ప్రెసిడెంట్ జి. శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అప్పారావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రమేష్‌రెడ్డి, సెలక్షన్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, ఎల్. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీడీ డాక్టర్ యన్‌వీ రాజ్‌కుమార్ వ్యవహరించారు.


