అపూర్వ సాయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్ధులు యలమంచిలి హైమవతి, డాక్టర్ రాజారావు రూ.35లక్షల విలువగల బస్సును వైద్యకళాశాలకు బహూకరించారు. వైద్య విద్యార్థులు పాత ఆస్పత్రికి, గ్రామీణ ప్రాంతాలకు వెవెళ్లేందుకు వీలుగా అందజేసిన ఈ బస్సును ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, డాక్టర్ యలమంచిలి రాజారావు, డాక్టర్ హైమావతి,వె వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గోవిందు, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ బాబ్జి శ్యామ్‌కుమార్,, పూర్వ విద్యార్థులు డాక్టర్ వీఎన్ వరప్రసాద్, డాక్టర్ అమ్మన పాల్గొన్నారు.
మహిళా విద్యకు ఆద్యుడు పూలే
కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాంజీ
కోనేరుసెంటర్: అఖండ భారతదేశంలో మహిళా విద్యకు ఆద్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా శుక్రవారం విశ్వవిద్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉపకులపతి రాంజీ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం రావడానికి వందేళ్ల ముందే మహిళా విద్య అవశ్యకతను గుర్తించి వారి కోసం పాఠశాలలు, వసతి గృహాలు కట్టించిన నిజమైన సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. అందుకే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన గురువు ఫూలే అని ప్రకటించుకున్నారన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి ఫూలేనే స్ఫూర్తిగా నిలిచారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష తదితరులు ప్రసంగించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, సహాయ ఆచార్యులు దుర్గా ప్రసాద్, శాంతి కపా, కవిత, రామాంజనేయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే డిసెంబర్ –2025 టర్మ్ ఎండ్ పరీక్షలు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకూ జరుగుతాయని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో ఆరు పరీక్ష కేంద్రాలను విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్, అనంతపురం ప్రాంతాలలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ ఇగ్నో వెబ్ సైట్ నందు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్స్‌ని ఇగ్నో విశ్వవిద్యాలయపు వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబందించి అభ్యర్థులు తమతమ అధ్యయన కేంద్రాలను థియరీ పరీక్షల అనంతరం సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కొత్తపేటలోని హిందూహైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా, ఈ మెయిల్ ద్వారా గాని లేదా 0866–2565253 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
గోశాల నిర్మాణానికి
భూమి పూజ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి పోరంకిలో ఉన్న వేద పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న గోశాలకు శుక్రవారం భూమి పూజ చేశారు. సుమారు 40–50 గోవులకు ఆశ్రయం కల్పించనున్న ఈ గోశాల నిర్మాణ భూమి పూజను ఆలయ వైదిక కమిటీ, స్థానాచార్యులు వి.శివప్రసాద్ శర్మ నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధి), కార్యనిర్వహణాధికారి వీకె శీనా నాయక్ పాల్గొని భూమి పూజ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.
అపూర్వ సాయం
అపూర్వ సాయం


