సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
విజయవాడలీగల్: ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా అవగాహన కల్పిస్తూ వారి ఆస్తులను కాపాడుతున్నామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్‌వి రాజశేఖర్‌బాబు అన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులకు శుక్రవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసు కమిషనర్ ఎస్‌వి రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ నగరంలో హెల్మెట్లు వాడకం తప్పనిసరి చేయడంతో ఎక్కువ మంది ప్రజలు హెల్మెట్లు ధరిస్తున్నారన్నారు. దీంతో 87శాతం వాహన ప్రమాదాలలో మరణాలు తగ్గాయని తెలిపారు. నగరం నలుమూలల సీసీకెమెరాల ఏర్పాటుతో నేరశాతం తగ్గిందని వివరించారు. సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న మాట్లాడుతూ సైబర్ నేరాల తీరు, వాటిని నిలువరించేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం సీపీ, డీసీపీలను బిబిఎ అధ్యక్షులు ఎ.కె.బాషా, గవర్నింగ్ బాడీ, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని అజయ్‌కుమార్, వేముల హజరత్తయ్య గుప్తా, న్యాయవాదులు సత్కరించారు.
కిడ్నీ వ్యాధి బాధితురాలు మృతి
తిరువూరు: కిడ్నీవ్యాధి బారిన పడి ఏకొండూరులో మరో మహిళ గురువారం రాత్రి మృత్యువాత పడింది. ఏకొండూరు చైతన్యనగర్‌కు చెందిన బాణావతు పీరీ(55) ఎనిమిదేళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. వ్యాధి తీవ్రతతో మృతిచెందింది. పీరీ మృతదేహాన్ని సీపీఎం నాయకులు పానెం ఆనందరావు, జెట్టి వెంకటేశ్వరరావు, అమ్మిరెడ్డి, కుమార్‌నాయక్ సందర్శించి నివాళులర్పించారు.
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు


