దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధిలో నిత్యం జరిగే అన్నప్రసాద వితరణకు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్ అమీర్‌పేట ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సారంపాటి మణి రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఆమె పేరిట రూ.1,01,116, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన శీతాల రవి, కుటుంబసభ్యులు రూ.1,00,000 అన్నప్రసాద వితరణకు విరాళం అందజేశారు. దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి వేదా శీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.


