ప్రత్యేక రైళ్లు డిసెంబర్‌ వరకు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్లు డిసెంబర్‌ వరకు పొడిగింపు

Nov 29 2025 6:51 AM | Updated on Nov 29 2025 6:51 AM

ప్రత్యేక రైళ్లు డిసెంబర్‌ వరకు పొడిగింపు

ప్రత్యేక రైళ్లు డిసెంబర్‌ వరకు పొడిగింపు

ప్రత్యేక రైళ్లు డిసెంబర్‌ వరకు పొడిగింపు

రైల్వేస్టేషన్‌( విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతా ల నుంచి ఇప్పటికే నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను డిసెంబర్‌ నెలాఖరు వరకూ పొడిగించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రూప్కర్‌ ప్రకటనలో తెలిపారు.

రైళ్లు ఇవే..

డిసెంబర్‌ 3 నుంచి 31 వరకు ప్రతి బుధవారం సంబల్‌పూర్‌–ఈరోడ్‌ (08311), డిసెంబర్‌ 5 నుంచి జనవరి 2 వరకు ప్రతి శుక్రవారం ఈరోడ్‌–సంబల్‌పూర్‌ (08321), డిసెంబర్‌ 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం విశాఖపట్నం–తిరుపతి (08583), డిసెంబర్‌ 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి–విశాఖపట్నం (08584), డిసెంబర్‌ 3 నుంచి 31 వరకు ప్రతి బుధవారం విశాఖపట్నం–తిరుపతి (08547), డిసెంబర్‌ 4 నుంచి జనవరి 1 వరకు ప్రతి గురువారం తిరుపతి–విశాఖపట్నం (08548), డిసెంబర్‌ 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం విశాఖపట్నం– చర్లపల్లి (08579), డిసెంబర్‌ 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం చర్లపల్లి–విశాఖపట్నం (08580), డిసెంబర్‌ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం విశాఖపట్నం–బెంగళూరు (08581), డిసెంబర్‌ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం బెంగళూరు–విశాఖపట్నం (08582), డిసెంబర్‌ 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్‌–యశ్వంత్‌పూర్‌ (02811), డిసెంబర్‌ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం యశ్వత్‌పూర్‌–భువనేశ్వర్‌ (02812), డిసెంబర్‌ 5 నుంచి 26 వరకు ప్రతి శుక్రవారం సోలాపూర్‌–అనకాపల్లి (01477), డిసెంబర్‌ 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం అనకాపల్లి–సోలాపూర్‌ (01478), డిసెంబర్‌ 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం షాలీమార్‌–ఎంజీఆర్‌ చైన్నె (02841), డిసెంబర్‌ 3 నుంచి 31 వరకు ప్రతి బుధవారం ఎంజీఆర్‌ చైన్నె–షాలీమార్‌ (02842) రైళ్లు నడవనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement