తగ్గిన దిగుబడులు.. పెరిగిన ఖర్చులు
మోంథా తుపాను వల్ల ఈ సంవత్సరం దిగుబడులు భారీగా తగ్గాయి. గతంలో ఎకరాకు 40 బస్తాలకు పైబడి దిగుబడి వచ్చిన పొలాల్లో ఈ ఏడాది 30 బస్తాలకు లోపే వస్తోంది. ఎకరాకు పది బస్తాల వరకు దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. తుపాను వల్ల పడిపోయిన పొలాలను యంత్రాలతో కోయించేందుకు ఎరకాకు రూ.5 వేల చొప్పున ఖర్చవుతోంది. పైగా ధాన్యాన్ని ఐదు రోజులు ఆరబెట్టాల్సి వస్తోంది. ఎకరా ధాన్యం ఆరబెట్టేందుకు ఇద్దరు కూలీలు అవసరం. మహిళలు రోజుకు రూ.500, పురుషులు రూ.700 చొప్పున కూలి తీసుకుంటున్నారు. యంత్రంతో కోసిన ధాన్యం విక్రయించేందుకు నాలుగైదు రోజులు ఆరబెట్టాలి. దీంతో రైతులకు ఎకరాకు రూ.5 వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. ఇలా ఈ ఏడాది దిగుబడులు తగ్గడం, ఖర్చులు పెరగడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది.


