రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మైలవరం: మండలంలోని కీర్తి రాయుని గూడెంకు చెందిన బట్టు గోపరాజు(22) మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై బయటికి వెళ్లి అతి వేగంగా వాహనం నడుపుతూ కీర్తిరాయునిగూడెం గ్రామం శివారు రెడ్డిగూడెం రోడ్‌లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో మృతి చెందా డు. మరుసటి రోజు గ్రామస్తులు చూసి మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చా రు. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యుల కు అప్పగించినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారంటూ వచ్చిన పుకార్లు అవాస్తవమని వైద్యశాఖ, పోలీసుశాఖ అధికారులు తేల్చారు. ర్యాగింగ్ అంటూ పుకార్లతో పాటు, ఓ పత్రికలో (సాక్షి కాదు) కూడా వార్త రావడంతో అధికారులు విచారణ జరిపారు. వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎంఈ కార్యాలయంలోని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (విజిలెన్స్) వైద్య కళాశాలకు వచ్చి విచారణ జరిపారు. మాచవరం పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగ సిబ్బంది కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. కాగా పోలీసులు ర్యాగింగ్ లాంటిది ఏమీ జరగలేదని అది ఫాల్స్ అని తేల్చేశారు. వైద్య శాఖ అధికారులు రెండు రోజుల కిందట 2023 బ్యాచ్ పార్ట్–1 విద్యార్థులకు, హౌస్‌సర్జన్‌లకు మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, ర్యాగింగ్ లాంటిది ఏమీ లేదని వివరించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రత్యేకంగా ఉంటున్నారని, వారికి ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి సెక్యూరిటీ వివరాలను విచారణకు వచ్చిన డాక్టర్ వెంకటేష్‌కు తెలిపారు.


