ఆస్పత్రులు తనిఖీ చేసిన కృష్ణా జిల్లా వైద్యాధికారి
పెనమలూరు: కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ యుగంధర్ మండల పరిధిలో రెండు ఆస్పత్రులను తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యధికారి యుగంధర్ మంగళవారం కానూరు నాగార్జున ఆస్పత్రి, పోరంకి కామినేని ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఈ ఆస్పత్రులపై ఫిర్యాదులో రావటంతో రోగులకు ఇక్కడ అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఆరోగ్య శ్రీ పథకం అమలును పరిశీలించారు. ఆస్పత్రుల్లో పలు రికార్డులు తనిఖీ చేశారు. ఆస్పత్రులు నిబంధనల ప్రకారం పని చేయాలని, రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని సూచించారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


